రామోజీరావు విజన్‌కు ఫిల్మ్‌సిటీనే నిదర్శనం: విజయ్‌ సేతుపతి

52చూసినవారు
రామోజీరావు విజన్‌కు ఫిల్మ్‌సిటీనే నిదర్శనం: విజయ్‌ సేతుపతి
రామోజీరావు మరణం చాలా బాధ కలిగించిందని కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి విచారం వ్యక్తం చేశారు. మహారాజా సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన ఆయన మాట్లాడారు. ‘హైదరాబాద్‌తో కంటే రామోజీ ఫిల్మ్‌సిటీతోనే నాకు జ్ఞాపకాలు ఎక్కువ. 2005లో ధనుష్ సినిమా కోసం తొలిసారి రామోజీ ఫిల్మ్‌సిటీకి వచ్చా. ఫిల్మ్‌సిటీని చూశాక ఒక వ్యక్తి ఇంత సాధించగలరా? అనిపించింది. రామోజీరావు విజన్‌కు ఫిల్మ్‌సిటీనే నిదర్శనం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అన్నారు.

ట్యాగ్స్ :