బీహార్‌లోని పాట్నా- హాజీపూర్ మధ్య గంగా నదిపై నిర్మించిన మహాత్మా గాంధీ వంతెనపై శనివారం ఘోర ప్రమాదం జరిగింది.
ప్రయాణికులతో నిండిన బస్సు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. దీంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ వెంటనే బస్సును ఆపడంతో ప్రయాణికులు కిటికీ నుంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.