నాగర్ కర్నూలులోని నల్లమల్ల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తాటి గుండాల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాదాపు 10 హెక్టార్లలో మంటలు అంటుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు చర్యలు చేపట్టారు.