రోడ్డుపై వెళుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వారి నిర్లక్ష్యంతో అప్పడప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి బైక్‌పై కారు పక్క నుంచి వెళ్తుండగా కారు అతను డోర్‌ను సడెన్‌గా ఓపెన్ చేశాడు. దీంతో బైక్ పై వెళ్తున్న యువకుడు ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అదే సమయంలో ట్రక్కు అతడి పై నుంచి వెళ్లగా త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.