ముంబైలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

50చూసినవారు
ముంబైలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బోరివలి ప్రాంతంలోని కనకియా సమర్పణ్‌ టవర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్