విశాఖ రైల్వేజోన్ తమ మొదటి ప్రాధాన్యత అంశమని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం గతంలోనే నిధులు కేటాయించిందని చెప్పారు. అయితే, కేంద్రం అడిగిన 52 ఎకరాలు సేకరించడంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. అందుకే రైల్వేజోన్ అంశం ముందుకు కదల్లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అడిగిన భూమిని సేకరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.