గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అరేబియా సముద్రంలో చేపల వేటపై నిషేధాన్ని ఆగస్టు 15 వరకు పొడిగించింది. చేపల పెంపకానికి ఎక్కువ టైం ఇవ్వాలని మత్స్యకారుల సంఘం చేసిన విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న అనంతరం.. కేంద్రంతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఆదివారం తెలిపింది. కాగా, రాష్ట్రంలో వార్షిక చేపల వేట నిషేధం ఏటా జూన్ 1 నుంచి జులై 31 వరకు అమల్లో ఉంటుంది.