ప్రముఖ డిజిటల్ పేమెంట్ వేదిక గూగుల్ పే యూపీఐ సర్కిల్ పేరుతో సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ సదుపాయంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో తమ యూపీఐ అకౌంట్‌ను వాడుకునే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం ఒకరి యూపీఐ ఐడీని వేరొకరు వాడేందుకు అనుమతి లేదు. కొత్తగా తీసుకొచ్చిన యూపీఐ సర్కిల్‌తో అది సాధ్యం కానుంది. అంటే ఒకరి బ్యాంక్ ఖాతాతో వేరొకరు కూడా లావాదేవీలు జరపవచ్చు. గరిష్టంగా ఐదుగురితో UPIని పంచుకోవచ్చు.