వరద ముప్పు.. హిమాచల్‌ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్

78చూసినవారు
హిమాచల్‌ప్రదేశ్‌లో కుంభవృష్టి వర్షాలతో వరద పోట్తెత్తింది. రాబోయే 36 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈక్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కులు, మండీ, సిమ్లా, చంబా, కంగ్రా, సిర్మౌర్ జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా ఆకస్మిక వరదల వల్ల ఇప్పటివరకు హిమాచల్‌లో ఐదుగురు మరణించారు. 50 మందికి పైగా గల్లంతయ్యారు.

సంబంధిత పోస్ట్