తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు సైతం వరద బాధితులను ఆదుకునేందుకు తనవంతుగా రూ.కోటి విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రెండు రాష్ట్రాల సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.50లక్షల చొప్పున విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు వరద పరిస్థితిని నుంచి త్వరగా కోలుకోవాలని.. కష్ట సమయంలో సమాజానికి తమవంతుగా సహాయపడాలని ట్వీట్ చేశారు.