శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుంది. ఎగువన కురిసిన వర్షాలకు డ్యామ్ కు వరద నీరు వచ్చి చేరుతుంది. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం జలాశయం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,39,147 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 69,333 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం: 884/885 అడుగులు. నీటి నిల్వ: 210.0320/215.8070 టీఎంసీలు. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.