అబుదాబిలోని జాయేద్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేబోతున్నది. సీఎన్ఎన్ కథనం ప్రకారం.. స్మార్ట్ ట్రావెల్ ప్రాజెక్ట్ ద్వారా 2025 నాటికి ఈ ఎయిర్పోర్ట్ అంతటా బయోమెట్రిక్ సెన్సర్లు అమర్చుతారు. ఇవి ప్రయాణికుల ముఖ కదళికలను గుర్తించగలుగుతాయి. కాబట్టి ప్రయాణికులు పాస్పోర్టు చూపించడం, తనిఖీలు చేయించుకోవడం వంటివి అవసరం ఉండదు. ప్రయాణం వేగంగా, భద్రంగా, సౌకర్యవంతంగా జరుగుతుంది.