ఫుడ్ పాయిజన్ కారణంగా వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని దహను తాలూకాలోగల 20 ఆశ్రమ పాఠశాలలకు చెందిన దాదాపు 250 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. వికారం, వాంతులు వంటి ఆనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. దీంతో అధికారులు విద్యార్థులను వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. వారిలో కొందరు డిశ్చార్జ్ అయ్యారు.