అలెగ్జాండర్ గ్రహంబెల్ తండ్రి వృత్తి రీత్యా ప్రొఫెసర్. తాత, తండ్రి, సోదరులు డిబేట్, భాష, సంభాషణల గురించి పరిశోధనలు చేస్తుండేవారు. గ్రహంబెల్ సోదరులు క్షయ సోకి మరణించారు. కన్నతల్లి వినికిడి శక్తి కోల్పోయింది. ఇది అలెగ్జాండర్ జీవితంలో పెద్ద విషాదం. తల్లికి తన మాటలు వినిపించాలనే ప్రయత్నంలో ఆమె చెవికి దగ్గరగా శబ్దాలు చేసేవాడు. తన చేతి వేళ్లతో ఆమె నుదిటిని తాకుతూ సంజ్ఞలు చేస్తుండేవాడు. అలా ధ్వని శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు.