తల్లిదండ్రుల ప్రేమకు వెలకట్టలేం. బిడ్డల శ్రేయస్సు కోసం వారు ఏమైనా చేస్తారు. అలాంటి వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. ఇందులో ఓ తండ్రి బైక్‌పై వెళుతూ.. వెనుక కూర్చున్న తన బిడ్డ క్షేమాన్ని ఎలా చూసుకుంటున్నాడో చూడొచ్చు. ఈ ఘటన బైక్ నంబర్ ఆధారంగా ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. తండ్రి బైక్ నడుపుతుండగా వెనుక కూర్చున్న చిన్నారి నిద్రపోతున్నాడు. తండ్రి తన చేత్తే బిడ్డ పడిపోకుండా జాగ్రత్త పట్టుకుని బైక్ నడుపుతున్నాడు.