సీఆర్పీఎఫ్ 85 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. వారికి పదోన్నతి

70చూసినవారు
సీఆర్పీఎఫ్ 85 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. వారికి పదోన్నతి
దేశంలోనే అతిపెద్ద పారామిలిటరీ దళం అయిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కి చెందిన మొత్తం 2,600 మంది కుక్‌లు, వాటర్ క్యారియర్‌లకు పదోన్నతి లభించింది. 1939లో ఏర్పాటైన 85 ఏళ్ల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. సీఆర్పీఎఫ్ క్యాటరింగ్లో రెండు ప్రత్యేక కేటగిరీలలో మొత్తం 12,250 మంది సిబ్బంది ఉన్నారు. ఈ మేరకు ఒక ఆర్డర్ ద్వారా 1,700 కుక్‌లు, 900 వాటర్ క్యారియర్‌లు కానిస్టేబుల్ పోస్టుల నుండి హెడ్ కానిస్టేబుల్‌లుగా పదోన్నతి పొందారని ఓ సీనియర్ అధికారి తెలిపాడు.

సంబంధిత పోస్ట్