వైసీపీ తరపున ఎన్నికల్లో గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు అందుబాటులో ఉన్న మిగతా నేతలతోనూ వైఎస్ జగన్ ఇవాళ సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను చర్చించారు. గెలిచిన వారిని నవ్వుతూ అభినందించారు. ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఆ బాధ నుంచి కోలుకుంటున్నట్లు కనిపించారు. ఈ ఫొటోలను
వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఓటమైనా, గెలుపైనా కలిసి నడుస్తామంటూ కామెంట్స్ చేస్తున్నాయి.