స్కిల్‌ వర్సిటీ నిర్వహణకు రూ. 100 కోట్లు కేటాయిస్తాం: CM రేవంత్‌

64చూసినవారు
స్కిల్‌ వర్సిటీ నిర్వహణకు రూ. 100 కోట్లు కేటాయిస్తాం: CM రేవంత్‌
స్కిల్‌ వర్సిటీ నిర్వహణకు రూ. 100 కోట్లు కేటాయిస్తామని CM రేవంత్‌ తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక అంశాలను పారిశ్రామికవేత్తలకు అధికారులు వివరించారు. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం కోరారు. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో యూనివర్సిటీ నిర్వహణకు సహకారం అందించాలని కోరారు. నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న సీఎం ఆలోచన గొప్పదని ఆనంద్ మహీంద్రా కొనియాడారు.

సంబంధిత పోస్ట్