జనవరి 10తో ముగిసిన వారంలో మన విదేశీ మారకపు నిల్వలు 8.714 బిలియన్ డాలర్లు తగ్గి 625.871 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని ఆర్‌బీఐ తెలిపింది. గతేడాది సెప్టెంబరు చివర్లో 704.885 బిలియన్ డాలర్ల వద్ద ఇవి జీవనకాల గరిష్ఠాన్ని తాకగా తర్వాత మరింత తగ్గాయి. కానీ పసిడి నిల్వలు 792 మిలియన్ డాలర్లు పెరిగి 67.883 బిలియన్ డాలర్లకు చేరాయి.