AP: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రైవేట్ ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ ఏర్పాటు కానుంది. ఇందుకోసం పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రూ.1800 కోట్ల పెట్టుబడితో 1200 ఎకరాల్లో దాన్ని ఏర్పాటు చేయనున్నారు. మార్చిలో శంకుస్థాపన చేయనున్నారు. తమ ఫ్యాక్టరీ నుంచి తొలి ఈవీ బైక్ 2026 డిసెంబర్ నాటికి విడుదల అవుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.