సాధారణంగా విదేశాలకు వెళ్లడం చాలా మంది కల. అలాంటి అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తుంటారు. ఈ ఏడాది మేషం, కర్కాటకం, తుల, మకర రాశుల వారికి అనివార్యంగా విదేశీయానం అదృష్టం పట్టబోతోంది. కొద్దిగా మీన రాశి వారికీ ఆ అవకాశం కనిపిస్తోంది. మేష రాశి వారు ఉద్యోగం, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే సూచనలున్నాయి. కర్కాటక రాశి వారు వ్యాపారం, ఆరోగ్యం విషయంలో విదేశీ ప్రయాణం చేయాల్సి రావొచ్చు.