ఏపీ ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/లేటరల్ ఎంట్రీ విధానంలో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ(ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంసీహెచ్) ఉత్తీర్ణులైన వారు సెప్టెంబర్ 9వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు, పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://dme.ap.nic.in