బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో మంగళవారం భేటీ అయ్యారు. పార్టీకి శివరాజ్ పెద్ద ఆస్తి అని,
త్వరలోనే ఆయనకు మరింత పెద్ద బాధ్యత అప్పగించనున్నామని నడ్డా, హోం మంత్రి అమిత్ షా పదేపదే చెబుతూ వస్తున్నారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా హుందాగా స్వ
ీకరిస్తానని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన
బీజేపీ.. మోహన్ యాదవ్‌కు సీఎం పదవిని కట్టబెట్టింది.