మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు అస్వస్థత

77చూసినవారు
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు అస్వస్థత
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉదయం ఇంట్లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు సూచించారు.

సంబంధిత పోస్ట్