మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా వైరాలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. శాంతినగర్ వద్ద ఆయన కారును వెనున నుంచి మరొ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యేకు చెందిన కారు డ్యామేజ్ అయింది. అయితే సండ్ర వెంకట వీరయ్యకు ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.