మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించి తీవ్ర నష్టం జరిగింది. భూమి కంపించడంతో అనేక భవనాలు కుప్పకూలాయి, అనేక మంది గాయపడ్డారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాల్లో చిక్కుకున్నవారిని బయటకు తీర్చేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే మయన్మార్‌లో భూకంపానికి ముందు, తరువాత ఎలా ఉందో చూపించే శాటిలైట్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.