యూపీలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. ఫరూఖాబాద్ జిల్లా నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిలారా గ్రామంలో ఓ ఫంక్షన్ జరుగుతున్న క్రమంలో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ మంటలు భారీగా చెలరేగడంతో ఇళ్లు పూర్తిగా దగ్ధమైంది. దీంతో గ్రామస్తులు వెంటనే మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం కాగా, సుమారు 2 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.