కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి నిధుల కేటాయింపులను ఏటా తగ్గిస్తూ వస్తోంది. రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది. తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల పనిని 4,32,834 కుటుంబాలకు మాత్రమే కల్పించారు. గత ఏడాది వంద రోజులు పనులు చేసిన వారి సంఖ్య 6,87,396గా నమోదైంది. దానితో పోలిస్తే వందరోజుల పనులు చేసిన కుటుంబాల సంఖ్య 38 శాతం (2,54,562) తగ్గింది. దళితుల్లో ఈ తగ్గుదల మరింత ఎక్కువగా ఉంది.