ఫార్ములా - ఈ కార్ రేస్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేసింగ్ నిర్వహించడం వల్ల హైదరాాబాద్ ఇమేజ్‌ని పెంచిందని, నగరం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందని అన్నారు. ఇందులో అవినీతి ఉందా? లేదా? అనేది చెప్పలేమన్నారు. కాగా ఈ వీడియోను BRS శ్రేణులు షేర్ చేస్తున్నాయి. KTRకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ దానం హైడ్రాకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే.