బందూక్, శేఖరం గారి అబ్బాయి మూవీలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో అనురూప్ రెడ్డి. అనురూప్ తాజాగా నటించిన మూవీ ‘ప్రేమించొద్దు’. ఈ మూవీ ఎలాంటి ప్రకటనలు లేకుండా అమెజాన్, బీసినీట్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ద్వారా జనవరి 10నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఆ మూవీని శిరిన్ శ్రీరామ్ బస్తీ నేపథ్యంలో సాగే ప్రేమకథగా 5 భాషల్లో తెరకెక్కించాడు. గతేడాది జూన్ 7న థియేటర్లలో విడుదల అయిన ఈ మూవీ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.