పారిస్ ఒలింపిక్స్లో 2 మెడల్స్ సాధించిన షూటర్ మను భాకర్ సహా నలుగురికి 2024 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు అందజేయనున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. చెస్ వరల్డ్ ఛాంపియన్ డి.గుకేశ్, హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ప్రవీణ్ కుమార్లు కూడా అవార్డు అందుకోనున్నారు. కాగా ఖేల్ రత్న నామినీల జాబితాలో మను భాకర్ పేరు లేకపోవడం గమనార్హం.