నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలి:సర్పంచ్

3163చూసినవారు
నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల కేంద్రము లో నకిలీ విత్తనాలు వేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మద్దిమడుగు రహదారిపై రైతులు, ఆయా పార్టీల నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ. రైతులు బాగుంటేనే మనందరం బాగుంటామని అలాంటి రైతులకు నష్టం జరిగి రోడ్డుపైకి రావడం బాధాకరమన్నారు. ఇక్కడ ఉన్న సబ్ డీలర్ల వల్ల ఈ తప్పిదం జరగలేదని, పెద్ద పెద్ద బడా బాబుల స్కామ్ అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదం వల్ల నకిలీ విత్తనాలు సరఫరా జరిగిందని మండిపడ్డారు. అధికారులు, రాజకీయ నాయకుల కమిషన్ల కక్కుర్తి వల్ల రైతులు నేడు రోడ్డుపైకి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతే రాజు అంటారు కదా? రైతు ఏనాడు రాజు కాలేదని బానిస గానే ఉన్నాడని తెలిపారు. రైతుల కష్టం సొమ్ముతో వ్యాపారులు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారే తప్ప రైతులు మాత్రం అలాగే ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరుతూ వ్యవసాయ అధికారి సురేష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చిన్న చంద్రయ్య, సింగిల్ విండో డైరెక్టర్ రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామలింగయ్య యాదవ్, బిజెపి నాయకులు రామోజీ, టిఆర్ఎస్ నాయకులు ముత్యాలు, నగేష్, సత్యనారి, అంజి, ఆనంద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్