అచ్చంపేట 1962 లో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటివరకు 13 సార్లు
ఎన్నికలు జరిగ్గా 6 సార్లు
కాంగ్రెస్, 5 సార్లు టిడిపి, 2 సార్లు టిఆర్ఎస్ కైవసం చేసుకున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఎవరు కూడా వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే అవుతాడా లేక చిక్కుడు వంశీకృష్ణ రెండోసారి అధ్యక్ష అంటాడా అనేది డిసెంబర్ 3న తేలనుంది.