అమ్రాబాద్ లోతట్టు ప్రాంతంలోని సలేశ్వరం జాతరలో మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని అచ్చంపేట ఒకటో వార్డు కౌన్సిలర్ గౌరీ శంకర్ ఆదివారం డిమాండ్ చేశారు. భక్తుల నుండి డబ్బులను వసూలు చేయడంలో చూపించిన శ్రద్ధ భక్తులకు వసతులు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. అటవీ అధికారులు సరైన వసతులు కల్పించకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. ఐదు రోజులపాటు నిర్వహించాల్సిన జాతరను మూడు రోజులకే కుదించడంతో భక్తుల రద్దీ ఎక్కువ అవ్వడంతో భక్తులు తిప్పలు పడ్డారని తెలిపారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. టోల్గేట్లని ఏర్పాటు చేసి భక్తుల నుండి డబ్బులను వసూలు చేయడం సిగ్గుచేటు అన్నారు. అనవసర నిబంధన పెట్టి సామాన్య ప్రజలను దేవుడి కృపకు దూరం చేశారన్నారు.