క్రీడాకారులకు సహకారం అందించాలి: సోలపోగుల

462చూసినవారు
క్రీడాకారులకు సహకారం అందించాలి: సోలపోగుల
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్పాన్సర్లు ముందుకు రావాలని నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. శుక్రవారం అచ్చంపేట పట్టణంలోని ఏంఎస్ఎన్ ఎక్స్ లెంట్ స్కూల్ చైర్మన్ సీఎం రెడ్డిని అసోసియేషన్ సభ్యులు కలిశారు. వచ్చేనెల అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరగబోయే సౌత్ జోన్, జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ కొరకై జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సెక్రెటరీ డాక్టర్ సోలపోగుల స్వాములు తెలిపారు. ఇక్కడ ఎంపికై రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ లో పాల్గొనే క్రీడా కారులకు ట్రాక్ షూట్ స్పాన్సర్ చేయాలని కోరారు. దానికి పాఠశాల చైర్మన్ సీఎం రెడ్డి స్పందిస్తూ రూ. 50 వేల విలువగల ట్రాక్ షూట్ లను అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాలను పాఠశాల చైర్మన్ కు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేన్ సభ్యులు వివరించారు. దానికి ఆయన పేద విద్యార్థులను ప్రోత్సహించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా కృషి చేస్తున్న అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి పరశురాముడు, వైస్ ప్రెసిడెంట్ బిక్షపతి యాదవ్, ఉపాధ్యాయుడు మన్ సూర్, వ్యాయామ ఉపాధయాయులు రాజేందర్, అరవింద్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్