జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం, ఎక్లాస్ పురం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వీరభద్రప్ప అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆయన మరణ వార్త విన్న అయిజ అఖిల పక్ష కమిటీ నాయకులు గ్రామానికి వెళ్లి ఆదివారం నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగర్ దొడ్డి వెంకట రాములు, కురువ పల్లయ్య, తాహెర్, రంగు మద్దిలేటి, దండోరా ఆంజనేయులు, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.