మున్సిపాలిటీలో అక్రమంగా చేపట్టిన కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా రేకుల షెడ్లు నిర్మించడంతో రోడ్డు వెడల్పు తగ్గి ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశానుసారం మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలను గురువారం కూల్చివేసే కార్యక్రమానికి పూనుకున్నారు.