మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గడియారం చౌరస్తాలో గురువారం సాయంత్రం కామదహనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి. జానకి హాజరైనారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. హోలీ పండుగకు మానవ విలువల ప్రాధాన్యతను తెలియజేస్తూ, చెడుపై మంచి విజయం సాధించినదానికి నిదర్శనంగా కామదహనం నిర్వహిస్తారని తెలిపారు. ధర్మ పరిరక్షణే మన లక్ష్యం అని పేర్కొన్నారు.