AP: పింఛన్‌దారులకు కూటమి సర్కార్ తీపి కబురు చెప్పింది. పింఛన్ పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. 'స్పౌజ్ పింఛన్' విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విధానం వల్ల పింఛన్ తీసుకునే వ్యక్తి చనిపోతే ఆ తర్వాత నెల నుంచి ఆయన జీవిత భాగస్వామికి పింఛన్ అందుతుంది. అలాగే పింఛన్ బదిలీకి కూడా అవకాశం కల్పించనుంది. దీంతో రాష్ట్రంలో ఎక్కడైన పింఛన్‌ను తీసుకునే అవకాశం రానుంది.