తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దేవరకద్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.