మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మీకు న్యాయం చేస్తా అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో, రిటైర్డ్ ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్ సమావేశానికి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి డిమాండ్ లను నెరవేర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాజు సింహుడు, జగపతి రావు తదితరులు పాల్గొన్నారు.