మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బస్సులు లోపలికి వెళ్లే దారిలో, బస్టాండ్ నుంచి బయటకు వచ్చే దారిలో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆటో డ్రైవర్లు తమ ఇష్టానుసారంగా వాహనాలను దారికి అడ్డంగా పెడుతుండడంతో విద్యార్థులకు, ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ డ్రైవర్లతో పాటు ప్రజలు కోరుతున్నారు.