మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు క్లబ్ ఫైవ్ మెన్ కమిటీ సభ్యుడు మెట్టుకాడి ప్రభాకర్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మెట్టుకాడి ప్రభాకర్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి సూచన మేరకు సభ్యత్వ నమోదు ప్రక్రియను నేడు ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకిటి అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.