దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం జానంపేటలో మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్, (యంఆర్హెచ్ఆర్యూ-టీజీ ) ఆదర్శ గ్రామీణ ఆరోగ్య పరిశోధన విభాగంను బుధవారం మహబూబ్ నగర్ ఎంపి డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సమస్యలకు సంస్థను ఉపయోగించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర బిజెపి ఇంచార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి, ఏఈ తార సింగ్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.