అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇంటిని కేటాయిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్, దేవరకద్ర ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇంటి పథకంలో భాగంగా నమూనా ఇంటి నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తామని వెల్లడించారు. ఈ విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు.