గత మూడు రోజులుగా వర్షాల నేపథ్యంలో ప్రమాదం పోంచి ఉన్న ఇండ్లలో ప్రజలు నివసించకూడదని జడ్చర్ల మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ బి. జ్యోతి కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం వార్డ్ ఆఫీసర్ భగవాన్ తో పాటు కావేరమ్మ పేటలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఇండ్ల యజమానులు జాగ్రత్త ఉండాలని సూచించారు. పాత ఇండ్లను తొలగించాలని లేకపోతే మున్సిపల్ నోటీసులు ఇచ్చి తొలగిస్తామన్నారు.