మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటైనర్ నుండి రోడ్డుపై పడిపోయిన మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కాటన్లు డ్యామేజ్ అయ్యి విక్రయించేందుకు అవకాశం లేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం బూరెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై మద్యం బాటిళ్లను వేసి లారీతో తొక్కించారు. దీంతో జాతీయ రహదారిపై మద్యం ఏరులై పారింది.