జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం పెద్ద రేవల్లి గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిల్లింగ్ స్టేషన్ ను ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ పేదరికం నుంచి ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నేతలు పొట్లపల్లి యాదయ్య, వెంకటేశ్వర్ రెడ్డి, తిరుపతి, భద్రు నాయక్, శ్రీను, వెంకటయ్య, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.