మహబూబ్ నగర్: జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

80చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నిన్న, మొన్నటితో పోలిస్తే సోమవారం చలి తీవ్రత పెరిగింది. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 24 గంటలలో జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామంలో 18. 0, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం కేంద్రంలో 15. 7, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లిలో 16. 7, వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో 18. 1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలుగా నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్