మహబూబ్ నగర్ జిల్లా కొండగల్ నియోజకవర్గం లగచర్ల దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిగా అనుమానిస్తున్న సురేశ్ అనే వ్యక్తి కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. ఇతను 42సార్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడినట్లు గుర్తించారు. మంగళవారం నిందితుడి కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిన్న ఔషధ పరిశ్రమ భూసేకరణ కోసం వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే.